అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!!
అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!! చందుర్తిలో ‘అమ్మకు అక్షరమాల’.. ఉల్లాస్ పరీక్షలకు 687 మంది హాజరు.. కాకతీయ,చందుర్తి: మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఉత్సాహంగా సాగింది. ప్రగతి మండల సమాఖ్య (సెర్ప్) ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో నిరక్షరాస్యులైన సంఘ సభ్యులకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 687 మంది హాజరై తమ అక్షరాస్యతను చాటుకున్నారు. చదవడం, రాయడం నేర్చుకోవాలనే పట్టుదలతో మహిళలు ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొన్నారు....