ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ

ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ మానకొండూర్‌ ఏడీఏ శ్రీధర్‌ ఆధ్వర్యంలో సోదాలు కాకతీయ, శంకరపట్నం: మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో నకిలీ, అనుమతి లేని ఎరువుల విక్రయాలపై అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఎన్‌పీకే మిశ్రమ ఎరువుల విక్రయాలను పరిశీలించారు. దుకాణాల్లోని స్టాక్‌ రికార్డులు, గోదాం నిల్వలు, అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల విక్రయాలు చేపడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో మానకొండూర్‌ ఏడీఏ శ్రీధర్‌, ఏఓ వెంకటేష్‌, హుజురాబాద్‌ రూరల్‌...