నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు
నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్ఠం చేయాలని, ఉప కమిషనర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పనులను స్వయంగా పర్యవేక్షించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రోజువారీ చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు, రోడ్లు,...