మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో మంగళవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ‘పోషణ మాసం–మా అంగన్‌వాడీ.. నా బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శంకరమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీడీవో రాధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ఎంతో ముఖ్యమని డాక్టర్‌ వేణుమాధవ్‌, డాక్టర్‌ రేణుక...