పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో పసికందు మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు చిన్న గుంత తవ్వి అందులో మృతదేహాన్ని ఉంచినట్లు తెలుస్తోంది. అనంతరం కుక్కలు మృతదేహాన్ని బయటకు లాగి పీక్కుతిన్నాయి. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని అక్కడ ఉంచిన వ్యక్తులను గుర్తించి పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనాస్థలంలో సర్పంచ్‌ గోదారి...