టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక కాకతీయ, నెల్లికుదురు : టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌ మద్దినేని గుట్టయ్య, కోఆర్డినేటర్‌ గాడిపెల్లి శేఖర్‌, జిల్లా కమిటీ సభ్యుడు జంపాల చక్రధర్‌ పర్యవేక్షణలో నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా మన తెలంగాణకు చెందిన మద్ది వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా సాక్షి విలేకరి బైరు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్‌ మల్యాల నరసయ్య, సహాయ కార్యదర్శిగా నమస్తే తెలంగాణ జర్నలిస్టు మస్కపురి సుధాకర్‌, కోశాధికారిగా జెల్ల ఉపేందర్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా...