లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు

లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు కాకతీయ, నర్సంపేట: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లెంకపల్లి సర్పంచ్‌ కస్తూరి విజయలక్ష్మి–రవీందర్‌ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్లో పరామర్శించారు. ఈ విషయాన్ని మాజీ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవీందర్‌ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన హరీశ్‌రావు వారిని ఓదార్చారు. అధైర్యపడవద్దని, పార్టీ, తాము అన్ని విషయాల్లో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయంపై కూడా భరోసా కల్పించారు.