ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర
ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాకతీయ, శంకరపట్నం: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం నాగయ్య మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ముత్తారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన ఉద్యమంలో నాగయ్య చురుకుగా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2011లో శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆందోళనలో పాల్గొన్న ఆయనపై...