ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కాకతీయ, నెల్లికుదురు: ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. టీపీటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో యాకయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మేటివ్‌ పరీక్ష పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకనం చేయడం వల్ల విద్యార్థులు మార్కులు, గ్రేడ్ల కోసం పరుగెత్తే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ విధానం ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని, ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. సబ్జెక్టు టీచర్‌...