రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు

రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు గృహజ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల సబ్సిడీ 4 సబ్‌స్టేషన్ల ఏర్పాటు.. సౌర విద్యుత్‌ పనులు వేగవంతం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, ఏదులాపురం : పాలేరు నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యల సత్వర పరిష్కారానికి రూ.205 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం వరంగల్‌ క్రాస్‌రోడ్‌లోని తరుణీహట్‌ ప్రాంగణంలో టీజీఎన్‌పీడీసీఎల్‌ డివిజన్‌ కార్యాలయం, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయ భవనాన్ని...