పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌ రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంటుకు సిరివెన్నెల దీక్షిత్‌ ఎంపిక విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించాలి మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సూచన కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్‌ జిల్లా ఐడీఓసీలో పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించడంతోపాటు సభ నిర్వహణ, చర్చ, ప్రశ్నించడం, సమాధానం ఇవ్వడం వంటి ప్రజాస్వామ్య విలువలను ఆచరణాత్మకంగా నేర్పడం కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా జిల్లా...