వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఏటూరునాగారం అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అభయారణ్యం పరిధిలోని నాలుగు అటవీ శ్రేణుల అధికారులు, సిబ్బంది అటవీశాఖ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. వన్యప్రాణులను కాపాడాలని, అడవులను సంరక్షించాలని నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులు, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు. అడవులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు వన్యప్రాణుల ప్రాధాన్యతను వివరించారు....