మాజీ సర్పంచ్ కుటుంబానికి కొండా అండ
మాజీ సర్పంచ్ కుటుంబానికి కొండా అండ కాకతీయ, గీసుగొండ: అనారోగ్యంతో మృతి చెందిన పోతురాజుపల్లి మాజీ సర్పంచ్ మంద బాబురావు కుటుంబానికి మాజీ మంత్రి కొండా సురేఖ అండగా నిలిచారు. బాబురావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సురేఖ.. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తనవంతు సహాయంగా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సర్పంచిగా బాబురావు గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ రాజు,...