రైస్ మిల్లు నిర్మాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా
రైస్ మిల్లు నిర్మాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామం సమీపంలో రైస్ మిల్లు నిర్మాణం చేయవద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామసభలో వినతిపత్రం అందజేసిన అనంతరం రైస్ మిల్లు ముందు, చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామానికి ఆనుకొని రైస్ మిల్లు నిర్మిస్తే కాలుష్యం, శబ్ద సమస్యలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇళ్లకు సమీపంలో, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కనీస దూరం పాటించకుండా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. మిల్లు...