గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం
గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం బహిరంగ ప్రదేశంలో వదిలివేత పంచాయతీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో దరఖాస్తుల నిర్వహణపై నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను భద్రపరచకుండా గ్రామసభ ప్రాంగణంలోని టేబుల్‌పై వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సిరిమిల్ల హరీష్ వీబీజీఆర్‌ఏఎంజీ పథకం కింద పశువుల కొట్టం, కొత్త జాబ్‌కార్డు కోసం రెండు దరఖాస్తులను గ్రామ కార్యదర్శి కవిత, సర్పంచ్ బండారుపల్లి వినయకుమారికి అందజేశారు. గ్రామసభ ముగిసిన...