వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల పరిరక్షణే లక్ష్యం

వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల పరిరక్షణే లక్ష్యం కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌: వన్యప్రాణులు, అటవీ ప్రాంతాలను ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి రక్షించడంతోపాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు 72వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం అటవీ డివిజన్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. ఒక బృందం ఏటూరునాగారం డివిజన్‌ కార్యాలయం నుంచి చిన్నబోయినపల్లి పల్లె ప్రకృతి వనం వరకు, మరో బృందం ఐటీఐ కళాశాల నుంచి జీడివాగు వరకు...