కష్టకాలంలో అండగా నిలిచిన ఉపసర్పంచ్ గట్టు శ్రావణ్

కష్టకాలంలో అండగా నిలిచిన ఉపసర్పంచ్ గట్టు శ్రావణ్ కాకతీయ, శంకరపట్నం : ముత్తారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కీర్తిశేషులు కనకం నాగయ్య ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబాన్ని ఉపసర్పంచ్‌ గట్టు శ్రావణ్‌ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచిన గట్టు శ్రావణ్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గూళ్ళ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.