ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌ కాకతీయ, ములుగు : ములుగు జిల్లా ఏఆర్‌ అదనపు ఎస్పీ సదానందం ప్రయాణిస్తున్న కారును టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి కారు బయటకు వస్తున్న సమయంలో బండారుపల్లి వైపు నుంచి ములుగు వైపు వేగంగా వస్తున్న టిప్పర్‌ కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. కారులో ఉన్న అదనపు ఎస్పీ సదానందంతో పాటు డ్రైవర్‌, సిబ్బందికి ఎలాంటి గాయాలు...