న్యాయవాదులపై దాడులను అరికట్టాలి

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి శ్రీధర్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి చేర్యాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరేళ్ల వీరమల్లయ్య కాకతీయ, చేర్యాల : న్యాయవాది గూడెపు శ్రీధర్‌పై దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చేర్యాల బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. నాగపురి గ్రామంలోని శ్రీధర్‌ ఇంటిపై దాడి చేసి, కారు అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు ఆస్తి నష్టం కలిగించి, చంపుతామని బెదిరించిన ఘటనను తీవ్రంగా ఖండించింది. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి...