నర్సింహులపేట దసరా ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నర్సింహులపేట దసరా ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక కాకాకతీయ,మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో దసరా ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎర్ర వెంకట్రామ్ నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా శామకురి శ్రీకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులందరి సమక్షంలో నిర్వహించిన సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ... దసరా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు...