ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌ బ్యాంకుకు తెలియకుండా మరో సంస్థలో తనఖా.. అసిస్టెంట్‌ మేనేజర్‌ అరెస్ట్‌ మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ రఘుపతి రెడ్డి వెల్లడి కాకతీయ, వరంగల్‌ బ్యూరో : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడిన మహబూబాబాద్‌ ఇండియన్‌ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ భూక్య రాజేష్‌.. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను బ్యాంకు అధికారులకు తెలియకుండా మణప్పురంలోని మణప్పురం ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో తనఖా పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదుతో ఆగస్టు 12న మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌...