12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భూమి పూజ
12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భూమి పూజ చిన్నజీయర్ స్వామీజీని ఆహ్వానించిన మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామీజీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామీజీని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల పాదాభివందనం చేసి దివ్యాశీస్సులు అందుకున్నారు. ఈ నెల 12న ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం శ్రీ చిన్నజీయర్ స్వామీజీ...