రైస్‌మిల్లుకు అనుమతులు రద్దు చేయాలి

రైస్‌మిల్లుకు అనుమతులు రద్దు చేయాలి ఇళ్లకు ఆనుకుని మిల్లు నిర్మించొద్దంటూ గ్రామస్తుల ధర్నా కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయని ఆందోళన కాకతీయ, ఇనుగుర్తి : చిన్ననాగారం గ్రామంలో ఎర్రబెల్లిగూడెం రోడ్డుకు ఇళ్లకు ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న రైస్‌మిల్లుకు అనుమతులు ఇవ్వొద్దని, ఇప్పటికే ఏ శాఖ నుంచి అనుమతులు మంజూరై ఉంటే వాటిని రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం కేసముద్రం–నెల్లికుదురు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎస్సై నరేష్‌ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడటంతో వారు గ్రామపంచాయతీకి వెళ్లి నిరసన తెలిపారు....