బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి
బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : అక్టోబర్ 10 నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిడబ్ల్యుఎంసి కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. 66 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్లు జిడబ్ల్యూఎంసి పరిధిలోని 66 డివిజన్లలో బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాలను...