ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య పడొద్దు.. ధైర్యంగా ఉండండి నేనున్నాను అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు.గురువారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలు,నాయకుల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించారు.మండల కేంద్రానికి చెందిన ఇజ్జగిరి సమ్మయ్య,దురిశెట్టి కొమురయ్య అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా వారి నివాసానికి వెళ్లి ఎర్రబెల్లి పరామర్శించారు.బాధితుడి ఆరోగ్య పరిస్థితిని,ప్రస్తుతం అందుకున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.ధైర్యంగా ఉండాలని,త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని...