గోదావరిలో పడి బాలుడి మృతి

గోదావరిలో పడి బాలుడి మృతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదం పూసూరులో విషాదం ఆరేళ్ల చిన్నారి మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబం కాక‌తీయ‌, ఏటూరునాగారం : గోదావరిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి హేశ్వంత్‌ (6) బహిర్భూమికి వెళ్లేందుకు మరో బాలుడితో కలిసి గోదావరి ఒడ్డుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో జారిపడి నీట మునిగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు....