కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు
కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు * ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో అన్నదాతలు * వ్యవసాయానికి కనీసం 15 గంటల నిరంతర విద్యుత్ అందించాలని రైతుల డిమాండ్ కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో విద్యుత్ కోతల కారణంగా వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు అత్యంత కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు అవసరమైన నీటిని అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు, విద్యుత్...