మృతుల కుటుంబాలకు ఇనగాల ప‌రామ‌ర్శ‌

మృతుల కుటుంబాలకు ఇనగాల ప‌రామ‌ర్శ‌ కాకతీయ, ఆత్మకూరు : ఆత్మకూరు గ్రామంలో ఇటీవల మృతిచెందిన పలువురి కుటుంబాలను హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి గురువారం పరామర్శించారు. గ్రామానికి చెందిన పొదిల సమ్మక్క ఇటీవల మృతిచెందగా, ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం న్యాయవాది తనుగుల సన్నీ తండ్రి తనుగుల సాంబయ్య మృతిచెందిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లారు. సాంబయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌...