వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం 20,050 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి స్వాధీనం ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌వో రెహమాన్ పిలుపు కాకతీయ, ఏటూరునాగారం : అడవులు, వన్యప్రాణులను కాపాడుకోవడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, మేధావులు సమష్టిగా భాగస్వాములు కావాలని ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌వో రెహమాన్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు అడవులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ములుగు జిల్లాలో సుమారు 87 శాతం అటవీ ప్రాంతం ఉందని, అడవుల కారణంగానే ప్రకృతి సమతుల్యత, వర్షపాతం, సహజ సౌందర్యం కొనసాగుతున్నాయని తెలిపారు....