నైరుతి రుతుపవనాల తిరోగమనం
నైరుతి రుతుపవనాల తిరోగమనం జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతున్న ఉపసంహరణ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే దిశగా కదులుతున్నాయి. అక్టోబర్ 8న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా ఉపసంహరించుకున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని...