చదువుల తల్లికి బతుకమ్మ నీరాజనం.. నాంపల్లి పాఠశాలలో వేడుకలు
చదువుల తల్లికి బతుకమ్మ నీరాజనం.. నాంపల్లి పాఠశాలలో వేడుకలు కాకతీయ, వేములవాడ : వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో వర్ణమాలతో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందస్తు బతుకమ్మ వేడుకల్లో భాగంగా అక్షరాలతో బతుకమ్మను తయారు చేసి విద్య, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటారు. ప్రముఖ జానపద కళాకారిణి, ‘సోకులాడి సిట్టమ్మి’ ఫేమ్ స్నేహ కట్కూరి బతుకమ్మ పాటలతో సందడి చేయగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా ఆడి పాడారు. ప్రధానోపాధ్యాయురాలు వత్సల, ఉపాధ్యాయులు ఉమాదేవి, రజిత, వినయ్ కోల, శైలజ,...