లింగంపేట పాఠశాలలో టీ షర్టుల పంపిణీ

లింగంపేట పాఠశాలలో టీ షర్టుల పంపిణీ కాకతీయ, చందుర్తి :రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఐక్యత యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టీ షర్టులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కొక్కుల నరేష్ చేతుల మీదుగా టీ షర్టులను అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐక్యత యూత్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల ఎల్లయ్య, హెచ్‌ఎం ఉమారాణి, యూత్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.