మోడల్ స్కూల్‌లో ఘనంగా ‘మా బడి బతుకమ్మ’ సంబరాలు
మోడల్ స్కూల్‌లో ఘనంగా ‘మా బడి బతుకమ్మ’ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన విద్యార్థులు కాకతీయ,శంకరపట్నం: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శంకరపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ‘మా బడి బతుకమ్మ’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను రూపొందించి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో నింపారు. పాఠశాల ప్రిన్సిపాల్ కే. ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. అనంతరం...