రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కోతలను నిరసిస్తూ తిమ్మాపురం సబ్‌స్టేషన్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా పోలీసుల అడ్డగింత పలువురు నాయకుల అరెస్ట్ కాకతీయ,నర్సంపేట టౌన్:-రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ...