ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం
ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం కాకతీయ, వరంగల్ : త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, ప్రభుత్వ...