ఎల్నినో ఎఫెక్ట్.. విద్యుత్ వినియోగం డబుల్!
ఎల్నినో ఎఫెక్ట్.. విద్యుత్ వినియోగం డబుల్! భూపాలపల్లి సర్కిల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్ ట్రాన్స్ఫార్మర్లపై అధిక భారం.. నిరంతర సరఫరాకు ప్రత్యేక చర్యలు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఎన్.సదానందం వెల్లడి కాకతీయ, భూపాలపల్లి : ఎల్నినో వాతావరణ పరిస్థితులు, లోటు వర్షపాతం, సుదీర్ఘ ఎండలతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని టీజీఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎన్.సదానందం తెలిపారు. వ్యవసాయ మోటార్ల వినియోగంతో పాటు ఇళ్లలో ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థపై అదనపు భారం పడుతోందన్నారు. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా...