దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు.. జాగ్రత్త!
దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు.. జాగ్రత్త! విలువైన ఆభరణాలు, నగదు భద్రపరుచుకోవాలి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం చందుర్తి సీఐ రవీందర్ సూచన కాకతీయ, వేములవాడ: దసరా పండుగ సెలవుల్లో సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చందుర్తి సీఐ రవీందర్ సూచించారు. ఇళ్లను ఖాళీగా ఉంచి వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు, భద్రతా అలారాలు...