భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి కాకతీయ, హన్మకొండ : భద్రకాళి చెరువు వరద నీటి అవుట్ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని కాపువాడలో భద్రకాళి చెరువు కట్ట వద్ద చేపట్టిన నాలా విస్తరణ పనులను, భూసేకరణ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన పనుల పురోగతిని, ఇంకా సేకరించాల్సిన భూమి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు....