శంకరాజుపల్లిలో గుర్తుతెలియని మృతదేహం ల‌భ్యం

శంకరాజుపల్లిలో గుర్తుతెలియని మృతదేహం ల‌భ్యం కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. తుపాకులగూడెం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన తిరుగురాళ్ల సమీపంలోని పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో అనుమానంతో అటువైపు వెళ్లి పరిశీలించగా మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏటూరునాగారం ఎస్‌ఐ బి. మహేష్‌కు ఘటన గురించి తెలియజేశారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు ఇంకా...