బాలికలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
బాలికలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి సైబర్ వేధింపులపై భయపడకుండా ఫిర్యాదు చేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పిలుపు కాకతీయ, హన్మకొండ : బాలికలు తమ హక్కులు, రక్షణపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, సైబర్ వేధింపులకు గురైతే భయపడకుండా తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం...