పట్టభద్రుల ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పట్టభద్రుల ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు కావాలి ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు పిలుపు కాకతీయ, ములుగు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు పిలుపునిచ్చారు. గతంలో ఓటు ఉన్నవారు సైతం నిబంధనల ప్రకారం ఫారం–18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ ధ్రువపత్రాన్ని జతచేసి ఫారం–18ను తహసీల్దార్ లేదా ఆర్డీవో...