జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి గంభీరావుపేట ఎస్సైని సస్పెండ్ చేయాలి.. కొరిమి వెంకటస్వామి డిమాండ్ కాకతీయ,శంకరపట్నం:జర్నలిస్టులు కొత్తూరు శేఖర్, రాతిపెల్లి సంపత్లను పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. జర్నలిస్టులపై జరిగినట్లు...