రైతుల సంక్షేమం.. అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!
రైతుల సంక్షేమం.. అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం! రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ.వెయ్యి కోట్లతో వేములవాడ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ,చందుర్తి: రైతుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రైతును రాజుగా చూడటమే కాకుండా రారాజుగా నిలబెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గురువారం చందుర్తి, సనుగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన అధ్యక్షులు గసికంటి ప్రభాకర్, ఎగోలం...