కారోబార్ కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శ

కారోబార్ కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శ కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కారోబార్ సోమనర్సయ్య, చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు బీమయ్య లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని శుక్రవారం బిఅర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.అయన వెంట నాయకులు రామచంద్రయ్య శర్మ, ఈదురు ఐలయ్య, సంజయ్, సుధాకర్,వెంకన్న,సమ్మయ్య హరీష్, శ్రీను, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉన్నారు.