బతుకమ్మ వేళ 109 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు
బతుకమ్మ వేళ 109 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంత్రి సీతక్క చేతుల మీదుగా మంజూరు పత్రాల పంపిణీ రూ.5.45 కోట్లతో 13 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు కాకతీయ, ములుగు : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి 13...