చుంచుపల్లి పీహెచ్సీని తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ
చుంచుపల్లి పీహెచ్సీని తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ వైద్య సేవలు, మందుల నిల్వలు, పారిశుద్ధ్యంపై పరిశీలన కాకతీయ ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, పారిశుద్ధ్య పరిస్థితులు, మందుల నిల్వలను పరిశీలించారు. మందుల నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లు, వ్యాక్సిన్ల భద్రత కోసం ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్ నిర్వహణను తనిఖీ చేసి, వాటి వివరాలను వైద్య సిబ్బందిని అడిగి...