బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క 32 మంది లబ్ధిదారులకు రూ.32.03 లక్షల విలువైన చెక్కుల పంపిణీ కాకతీయ, ములుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు....