పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం ప్రాథమిక వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న, పత్తికి ప్రభుత్వ కనీస మద్దతు ధరకు మించి ధరలు పలికాయి. మొక్కజొన్న క్వింటాల్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 కాగా, మార్కెట్‌లో రూ.2,900 ధర లభించింది. పత్తికి మద్దతు ధర రూ.8,667 ఉండగా, గరిష్ఠంగా రూ.9,200 పలికింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవక పంటల దిగుబడులు గణనీయంగా తగ్గాయని రైతులు పేర్కొన్నారు. దిగుబడులు తగ్గిన పరిస్థితుల్లోనూ మద్దతు...