ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం
ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు న్యాయవాది, విగ్రహదాత డాక్టర్ నలమాస కృష్ణ గౌడ్ శ్రీరామగిరిలో వీరనారి విగ్రహావిష్కరణ కాకతీయ, నెల్లికుదురు: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శంగా నిలవాలని హైకోర్టు న్యాయవాది, విగ్రహదాత డాక్టర్ నలమాస కృష్ణ గౌడ్ అన్నారు. శనివారం శ్రీరామగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని నలంద విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ, మానుకోట బార్ అసోసియేషన్...