పండుగకు పల్లెబాట..
పండుగకు పల్లెబాట.. హైవేలపై ట్రాఫిక్ పాట్లు! చౌటుప్పల్, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేత విజయవాడ హైవేపై 45 నిమిషాల నుంచి గంటకుపైగా నిరీక్షణ బస్టాండ్లు కిటకిట.. ప్రత్యేక బస్సుల ఛార్జీలపై ప్రయాణికుల ఆగ్రహం కాకతీయ, హైదరాబాద్ : దసరా పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు నగరవాసులు పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్–విజయవాడ హైవేతో పాటు హైదరాబాద్–ముంబై, చెన్నై మార్గాల్లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం మహర్నవమి, మంగళవారం విజయదశమి సెలవులు రావడంతో...